దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా చర్యలు

వైఎస్సార్‌ కడప జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రతీరోజు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. వన్ టౌన్ పరిధిలో సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ విధులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్ల వద్ద శనివారం దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యలు ప్రజలకు భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్