కడప కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

కడప నగరంలోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 46వ డివిజన్‌కు చెందిన వైసీపీ కార్పొరేటర్ జమీల్ ఏజెంట్ అప్రోజ్‌పై, టీడీపీ అభ్యర్థి హనీఫ్ ఏజెంట్లు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕