ఖైదీలకు వీల్ ఛైర్స్, వాకర్స్, వినికిడి యంత్రాలు పంపిణీ

కడప జిల్లా ప్రధాన న్యాయధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామ గోపాల్, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎస్. బాబా ఫక్రుద్దీన్ కడప పురుషుల, మహిళల కేంద్ర కారాగారలను, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ లను విజిట్ చేశారు. ఈ సందర్భంగా వారు ఖైదీలకు వీల్ ఛైర్స్, వాకర్స్ వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయమును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕