విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

సంబేపల్లి మండలం బుడ్డారెడ్డి ఇండ్ల సమీపంలో రౌతుకుంట గ్రామ హరిజనవాడకు చెందిన బత్తిన మనోహర్ అనే యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో షాక్‌ తగిలి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్