కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం 2,339 మంది చిన్నారులకు గాను 2,106 మందికి టీకాలు వేశారు. మిగిలిన వారికి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నారు. వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా టీకాలు వేయించాలని డా. ముని శంకర్ సూచించారు.