చెన్నూరు: ఎస్బీఐ బ్యాంకులో చోరికి యత్నం

చెన్నూరు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో దుండగులు చోరీకి విఫల ప్రయత్నం చేశారు. స్థానికులు వివరాల మేరకు దుండగులు శనివారం రాత్రి బ్యాంకు ప్రధాన గేటు వద్ద తాళాలు పగలగొట్టి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నం చేశారు. ఘటనకు సంబంధించి సమాచారం ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కడప డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్