చెన్నూరు: యువతిని మోసం చేసిన యువకుడికి జీవిత ఖైదు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసగించిన వ్యక్తికి మంగళవారం న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ. 1.5 లక్షల జరిమానా విధించింది. చెన్నూరు మండలానికి చెందిన యువతికి 2021లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేష్ తో పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని నమ్మించి వెంకటేష్ పలుమార్లు కడపకు వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడు.

సంబంధిత పోస్ట్