కమలాపురంలో వైరు దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. దళితుల భూములలో మంగళవారం రాత్రి 10 మంది రైతులకు చెందిన మోటారు వైరులు దొంగతనానికి గురయినట్లు వారు తెలిపారు. కేవలం మేము దళిత రైతులం అని మాకు న్యాయం చేయండి సారు అంటూ అధికారులను వేడుకుంటున్నారు.