కమలాపురం నగర పంచాయతీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం రైల్వే గేటు సమీపంలో ట్రాక్టర్ స్కూటర్ ను ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన సరోజమ్మగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ను వదిలేసి పారిపోయారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.