శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ

చెన్నూరులోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు అమ్మవారి కిరీటం, ముక్కు పుడక, చెవి పోగులతో సహా సుమారు అరకిలో వెండి ఆభరణాలను దొంగిలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు గుడి తెరిచేసరికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕