రెండవ శనివారం కారణంగా వల్లూరు మండలం నందు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వల్లూరు మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ లావణ్య తెలిపారు. వల్లూరు, పైడికాల్వ, దుగ్గాయపల్లె సబ్ స్టేషన్ నందు విద్యుత్ మరమ్మతులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ ఉండదని ప్రజలందరూ గమనించి సహకరించాలని ఆమె తెలియజేశారు.