వల్లూరు: అదుపు తప్పి వాహనాలను ఢీకొన్న లారీ

వల్లూరు మండలం పాపాగ్ని నగర్ వద్ద గురువారం సాయంత్రం లారీ అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు. కడప నుండి కమలాపురం వైపు వెళుతున్న లారీ రెండు ద్విచక్ర వాహనాలు, ఓ బస్సును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలు కాగా ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. చికిత్స నిమిత్తం లారీ డ్రైవర్ ని కడప రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్