వంక పోరంబోకులో అక్రమంగా నిర్మించిన కట్టడాని వల్లూరు రెవెన్యూ అధికారులు కొరడా జులిపించి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. వల్లూరు మండలం తోళ్ళగంగనపల్లె వద్ద నలిపిరెడ్డిపల్లెకు చెందిన వైసిపి నేత వైసీపీ ప్రభుత్వం హయంలో అధికారం అడ్డుపెట్టుకొని 30 సెంట్ల వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. సర్వే నంబర్ 87లో అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారుల శనివారం జెసిబితో కూల్చివేశారు.