పేకాట ఆడుతున్న 13మందిని అరెస్టు చేసినట్లు మదనపల్లె వన్ టౌన్ సీఐ చాంద్ భాషా తెలిపారు. బుధవారం రాత్రి పట్టణంలోని నీరుగట్టుపల్లె కాట్లాటపల్లె రోడ్డులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు అదేశాలతో వెంటనే పేకాట స్థావరంపై స్టేషన్, ఎస్టీఎఫ్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి, 13మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.