టైర్ల కంపెనిలో పని చేయడానికి వచ్చిన కార్మికుడిని కత్తితో పొడిచి హత్య చేసి, మరొక వ్యక్తిపై దాడిచేసిన కేసులో నిందితునికి మదనపల్లె 2వ అదనపు జిల్లా జడ్జి బందెల అబ్రహాం జీవితఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పుచెప్పారు. ఏపీపీ, టూ టౌన్ సీఐ యువరాజ్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు. మదనపల్లె భాగ్య లక్ష్మి రైస్ మిల్లులో టైర్ల తయారీకి వచ్చిన కేరళ మణికంఠన్ ను 2016లో సుబ్రహ్మణ్యం హత్య చేయడంతో శిక్ష పడింది.