అన్నమయ్య జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు, జనసేన పార్టీ సర్పంచి, ఎంపీటీసీలకు పోటీ చేస్తుందని జనసేన రాయలసీమ కో-కన్వినర్ గంగారపు రాందాస్ చౌదరి, టమోటా మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జనసేన ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంతో కలసి అన్ని పంచాయతీలలో తాము పోటీ చేస్తామన్నారు.