పెద్దమండ్యం ఆలయంలో బుజ్జి గోమాత సందడి, ఉత్సవాలు ఘనంగా ముగింపు

అన్నమయ్య జిల్లా మదనపల్లె తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం అభయ ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాలు రెండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో బుజ్జి గోమాత సందడి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎంపీపీ పూర్ణచంద్రిక, సర్పంచ్ బాషా, ఎంపీపీ జయరాములు స్వామివారిని దర్శించుకున్నారు. రామాంజనేయ క్యాటరింగ్ అధినేత కె.హరి భారీ అన్నదానం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు కత్తి భాగమ్మ, నాగరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్