మదనపల్లె మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్తమస్ (26) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అమ్మచెరువు మిట్టకు చెందిన అతను బైక్‌పై తట్టివారిపల్లె బైపాస్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.