నీలగిరి తోటకు నిప్పు: పెట్రోల్ బంక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

మదనపల్లె మండలం 150వ మైలు సమీపంలోని నీలగిరి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన బుధవారం కలకలం రేపింది. తోటలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వైపు వ్యాపిస్తున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి చురుకైన చర్యల వల్ల పెట్రోల్ బంక్‌కు ఎలాంటి ప్రమాదం కలగకుండా తృటిలో తప్పింది. మంటలు పెట్రోల్ బంక్ వరకు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్