వీధి కుక్కలు ఒకరి ప్రాణాలను హరించాయి. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన కురబలకోట మండలంలో ఆదివారం జరిగింది. ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ కథనం ప్రకారం పడమటి దళితవాడకు చెందిన కురేసి కృష్ణప్ప కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ముదివేడుకు వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండగా, దారిలోని చేలల్లో మద్యం మత్తు కారణంగా పడిపోగా.. అర్థ రాత్రిలో వీధి కుక్కలు దాడిచేయాగా మృతి చెందినట్లు వివరించారు.