అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన పార్టీ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా యువ నాయకులు లైఫ్ కేర్ మెడికల్స్ రాజశేఖర్, చంద్రశేఖర్(చంటి) పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ అబ్జర్వర్లు అడపా సురేంద్ర, జయ భవ్య స్వీకరించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశం కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని అబ్జర్వర్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని రాజశేఖర్, చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.