మదనపల్లె బసినికొండ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలు మేరకు. పుంగునూరు నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో-ఆర్టీసీ బస్సు రెండు ఎదురు ఎదురుగా ఢీ కొన్న ఘటనలో పెద్దపంజాణి మండలం లింగాపురానికి చెందిన రామకృష్ణ, ఈడిగపల్లికి చెందిన రెడ్డిసంపత్, సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.