ఆటో ఢీకొని శనివారం గంగులమ్మ (70) మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అది ప్రమాదం కాదని, హత్య అని తేల్చారు. ఆరోగ్యం బాగాలేదని కూతురు వద్దకు తిరుపతికి వెళ్లాలని మదనపల్లి చంద్ర కాలనీలో గంగులమ్మ ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ విష్ణు కు ఆమె రూ.20 ఇచ్చి తిరిగి రూ. 5 అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిడుతూ ఆటోలోనే కూర్చుంది. విష్ణు అవమానంతో ఆమెను చంపి ప్రమాదంగా చిత్రీకరించాడు.