కర్ణాటక రాష్ట్రం గెలిజిగూరులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సువర్ణముఖి బస్సు, మరో ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు వివరించారు. మదనపల్లి కమ్మ వీధిలో కండక్టర్ బాబు అలియాస్ గంగాధర్ (58) మృతి చెందగా 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుండి కడపకు వెళుతున్న ప్రైవేటు బస్సు, ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకు వెళుతున్న బస్సు మలుపులో వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.