మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు బాలాజీ (27) తీవ్రంగా గాయపడ్డాడు. సిటిఎం గంగాపురానికి చెందిన బాలాజీ, పనులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా, 5వ మైలు వద్ద పెట్రోల్ బంక్ నుండి రోడ్డుపైకి వచ్చినప్పుడు ఆటో ఢీకొట్టింది. స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.