పిల్లల విషయమై జరిగిన వివాదం తీవ్రంగా మారి, మదనపల్లెలో శనివారం ఉదయం ఓ మహిళపై కౌన్సిలర్ సలీం దాడి చేసిన ఘటన జరిగింది. స్థానిక చలపతిరావు కాలనీలో నివసించే ఫయాజ్, ఆయేష భాను పిల్లలపై ఎవరో నీళ్లు చల్లడంతో ఆయేష భాను ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ సలీం మరికొందరితో కలిసి ఆమె ఇంట్లోకి వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.