మదనపల్లె: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

మదనపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఇల్లు కాలిపోయి సుమారు రూ. 6 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిన సంఘటన మదనపల్లిలో జరిగింది. అగ్నిమాపక అధికారులు ఇచ్చిన వివరాలు మేరకు మదనపల్లి మండలం లోని కోళ్లబైళ్ళు గ్రామం, బాబు కాలనీలో బుధవారం అర్థ రాత్రి జోరుగా గాలి, వాన వచ్చి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కాలిపోవడంతో సుమారు రూ. 6లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్ని మాపక అధికారి శివప్ప తెలిపారు.

సంబంధిత పోస్ట్