మదనపల్లి: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

మదనపల్లి మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు అడవి జంతువుల నుండి పొలాలను రక్షించుకోవడానికి పంట చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి చిరుత పులి చిక్కుకుపోయింది. బుధవారం ఉదయం గమనించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి సమీపంలోకి చిరుత పులి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్