మదనపల్లె: చేయి కోసుకుని లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

మదనపల్లె చంద్ర కాలనీకి చెందిన మురళీ నాయక్ కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో కత్తితో చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు బాధితుడు చేతి నరాలు కోసుకున్న వెంటనే స్థానికులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో బాధితుడు కోలుకుంటున్నాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్