మదనపల్లె: ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం

మదనపల్లె మండలంలో శనివారం కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ (52) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాలెంకొండకు చెందిన చంద్రశేఖర్ కొండమరిపల్లి గోవర్ధన నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్