అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ పరిధిలోని కదేవలం వీధిలో ఓ ఇంటి దగ్గర గుమ్మానికి ఉరి వేసుకుని వ్యక్తి చనిపోయి వేలాడుతూ కనిపిస్తున్న మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే స్థానిక ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.