మదనపల్లె: వాహనాలకు నిప్పు

మదనపల్లె మండలం కొత్తవారిపల్లెలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టడంతో రూ. 1.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంటి ముందున్న రెండు ద్విచక్ర వాహనాలకు శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నిప్పు పెట్టారు. ఇదే గ్రామానికి చెందిన మదన్మోహన్రెడ్డికి, తమకు ఆర్థిక లావాదేవీలు విషయమై గొడవలున్నాయని అతనే నిప్పు పెట్టి ఉండవచ్చునని బాధితుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్