అప్పుల బాధ తాళలేక ఓ యువతి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శుక్రవారం మదనపల్లెలో చోటు చేసుకుంది. బాధితురాలు కథనం మేరకు మదనపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వారు నివాసం ఉంటున్నారు. రాణి భర్త రెడ్డప్ప కువైట్లో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారులు పలువురు దగ్గర అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చలేదని రుణదాతలు ఒత్తిడి చేయడంతో మనస్థాపానికి గురై ఎలకల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది.