మదనపల్లి పట్టణ పరిధిలోని బాబు కాలనీలో నివాసం ఉంటున్న నవీన్ సోమవారం రాత్రి గంగమ్మ జాతరలో పాల్గొని మద్యం తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చాడనే కారణంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ విషం తాగాడని బాధితుడి తల్లిదండ్రులు మంగళవారం తెలిపారు. వెంటనే బాధితుడిని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స నిమిత్తం కోలుకుంటున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.