ఆర్టీసీ బస్సు ఢీకొని పాదచారి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగిందని 1వ పట్టణం సిఐ చాంద్ బాషా తెలిపారు. మదనపల్లి సాయి రామన్న వీధికి చెందిన శ్రీకాంత్ (62) నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా చికిత్స పొందుతూ మరణించాడు.