మదనపల్లి నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలంలోని బండ్లపల్లి వద్ద దంపతులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో భార్యా భర్తలు తీవ్రంగా గాయపడగా, వారిని 108 ద్వారా హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యాయత్నానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎస్సై తిప్పేస్వామి, సిఐ సత్యనారాయణ ఘటన స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.