ఆర్ఎంపి వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాలసముద్రం మండలం టివిఎన్ఆర్ పురం గ్రామానికి చెందిన రామ్మూర్తి రాజు జెసిబి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఓ ఆర్ఎంపి వైద్యుడు ఇంజక్షన్ చేశాడు. నోటిలో నురుగు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే రామసముద్రం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.