బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జులేఖ బేగం, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును పొదుపు చేసి భవిష్యత్తు తరాలకు అందించాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ అరుణ, పర్యవేక్షకులు బహుద్ది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.