మదనపల్లె: కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన విద్యార్థి

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు శుక్రవారం బి కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. ములకలచెరువు మండలం, బురకాయల కోటకు చెందిన బండి అభిషేక్ అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్  కళాశాలలో చదువుతున్నాడు. బైక్ పై ఇంటికి వెళుతుండగా కనికలతోపు వద్ద ఇతని బైకును కారు ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అపసమారకస్థితికి చేరుకున్న బాధితుడిని.. మదనపల్లికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని రుయాకు తరలించారు.

సంబంధిత పోస్ట్