సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు.. రూ. 40 లక్షల రికవరీ

విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం, 930 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లికి చెందిన రాజేష్ గతంలో వృద్ధుల గొలుసులు లాక్కెళ్లడం, ఇళ్లలో దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. యువత సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్