రోడ్డు ప్రమాదం కాదు.. హత్యగా తేలిన చిన్న బుడ్డా నాయక్ మృతి

మదనపల్లె మండలం నారమాకుల తండాకు చెందిన చిన్న బుడ్డా నాయక్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత రోడ్డు ప్రమాదంగా నమోదైన ఈ ఘటన, పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో శనివారం హత్యగా తేలింది. మృతుడి భార్య రియాల, ఆమె ప్రియుడు రెడ్డెప్ప నాయక్ కలిసి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో ప్రమాదం కేసును హత్య కేసుగా మార్చి, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్