అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలం మల్లెల గ్రామానికి చెందిన సోనియా, ఆమె మూడేళ్ల కుమారుడు మహమ్మద్ కియాన్ కుటుంబ కలహాల నేపథ్యంలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త బాబా ఫక్రుద్దీన్, అత్త రాబియాబి, మామ హజ్మత్ వేధింపులు, మసీదు నుంచి విడాకుల నోటీసు కారణంగా ఆమె మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనలో తల్లీకుమారుడిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.