వాల్మీకిపురం: ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు

వాల్మీకిపురం మండలం కొత్తపల్లి చెరువులో మంగళవారం ఈతకు వెళ్లిన రంజిత్ కుమార్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆరమడక గ్రామానికి చెందిన రంజిత్ తన స్నేహితులతో కలిసి చెరువులో ఈత ఆడుతుండగా నీటిలో మునిగిపోయాడు. స్నేహితుల అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు గాలింపు చేపట్టగా, సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్