మదనపల్లిలో నాటు సారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

మదనపల్లెలో నాటు సారాను అక్రమంగా విక్రయిస్తున్న హరిత అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నారమాకుల తండాకు చెందిన హరిత తన ఇంట్లో ఐదు లీటర్ల నాటు సారాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఎక్సైజ్ సీఐ భీమలింగ ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, హరితపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్