మదనపల్లె మండలంలో మంగళవారం రాత్రి సంఘ బహిష్కరణకు గురైన లీనా (30) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తపల్లి శాంతిపురానికి చెందిన లీనాపై సంఘంలోని కొందరు వేధింపులకు పాల్పడి బహిష్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై మందులు మింగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.