రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లి సిటిఎం వద్ద జరిగింది. కదిరి రైల్వే ఎస్ఐ రహీం తెలిపిన వివరాల మేరకు మదనపల్లి సిటిఎం వద్ద సుమారు 25 సంవత్సరాలు వయసు ఉన్న గుర్తు తెలియని యువకుడు ధర్మవరం నుండి నరసాపురం వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.