కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో వైసిపి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మైదుకూరులో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చర్యలతోనే రాజీనామా చేశానంటు ఆరోపించారు. ఇది ఇలా ఉండగా టిడిపి లేదా జనసేనకు వెళ్లే అవకాశం ఉందంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది.