చాపాడు మండలం అల్లాడుపల్లే వద్ద ముగ్గురు మోటర్ బైక్ దొంగలను అరెస్ట్ చేసి 27 మోటార్ సైకిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటారు బైక్ దొంగలను బుధవారం అరెస్టు చేసినట్లు మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, చాపాడు డీఎస్పీ భవాని, ఎస్సై చిన్న పెద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ బైక్ దొంగలను అరెస్టు చేయడంతో కడప ఎస్పీ అశోక్ కుమార్ పోలీసులను అభినందించారు.