మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డమాయపల్లెలో బుధవారం సాయంత్రం రైతు మన్యం బాల సిద్ధారెడ్డి (50) తన పొలంలో బోరు వేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, పక్క పొలం యజమాని అబ్దుల్ రసూల్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో సిద్ధారెడ్డి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.