యువకుల మృతి కేసులో ఐపీఎస్ అధికారితో దర్యాప్తు

బ్రహ్మంగారిమఠంలో దళిత యువకుల మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను విచారణాధికారిగా నియమించినట్లు మైదుకూరు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దళిత సంఘాలు ఆందోళన విరమించాలని కోరుతూ, సాక్షి వీడియోను ఎఫ్ఎస్ఎల్ కు పంపి, నివేదికను త్వరగా తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్